– ప్రారంభమైన బొకస్ కార్డుల ఏరివేత
– స్థానిక ఎన్నికలకు సమాయత్తం
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు మరో అవకాశమిచ్చిoది.2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటరు నమోదుకు షెడ్యూల్ విడుదల చేయగా, బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు ఈ నెల 20 నుంచి ఇంటింటా సర్వే చేపట్టాలని బీఎల్ వోలను ఆదేశించింది. ఈ క్రమం లో కలెక్టర్ ఆదేశాలు జారీ చేయగా అధికార యంత్రాంగం సదరు పనుల్లో నిమగ్నమైంది. స్థానిక సంస్థల్లో యువత పాత్ర కీలకం. ఇప్పటికై నా ఓటరుగా నమోదు కాని యువత ఓటే తూటాగా ముందుకు సాగాల్సిన తరుణమిది. ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకుని అప్రమత్తమవడం అత్యవసరం. గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఓటు తొలగించారని గగ్గోలు పెట్టిన ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో ఓటుందా, లేదా అనేది ఒక్కసారి సరిచూసుకోండి. లేకుంటే వెంటనే నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రారంభమైన ఏరివేత
ఈ నెల 20నుంచి బోగస్ ఓట్లను ఏరివేయనున్నారు. బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) వారివారి బూత్ పరిధిలో ఓటరు జాబితాతో ఇంటింటా వివరాలను ఆరాతీయనున్నారు.అనుమున్న ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు.అలాగే మరణించినవారు,వలసవెళ్లినవారి పేర్లను తొలగిస్తారు.
ఆఫ్లైన్ లో దరఖాస్తు..
ఓటరుగా నమోదు కావాలనుకునేవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-6 తీసుకుని అందులో వివరాలు పొందుపరిచి అక్కడే కార్యాలయంలో సమర్పించాలి. ఆధార్ కార్డు, ఇంటి చిరునామాను సూచించే కరెంట్ బిల్లు, ఇతరత్రా ఏదేని ఆధారాన్ని జత చేయాల్సి ఉంటుంది. బీఎల్ వోలు క్షేత్రస్థాయిలో విచారించి ఓటరుగా నమోదు చేయనున్నారు.
పలు మార్గాలు..
గ్రామ పంచాయతీ క్యాంపెయిన్ కు వెళ్లలేనివారు అరచేతిలోనే ఓటరుగా నమోదు కావచ్చు. http:/// voters.eci.gov.in వెబ్సై ట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అందులో మొబైల్ నంబర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసు కోవాలి.అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఫారం-6, జాబితా నుంచి పేరు తొలగింపుకు ఫారం-7, తప్పొప్పుల సవరణకు ఫారం-8, ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం కోసం ఫారం-6బి కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి అందులో పొందుపర్చాల్సిన వివ రాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వివరాలు ఏఈఆర్వోకు వద్దకు వెళ్తాయి. పరిశీలించి ఆమోదిస్తారు.
యాప్ తో కూడా..
బీఎల్వో వద్దకు వెళ్లలేని వారు వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో voter helpline mobile App యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా.. లేదా చూసుకునే అవకాశం కల్పించారు.
గుర్తింపు కార్డు పొందడమిలా..
ఓటరు గుర్తింపు కార్డు కావాలనుకునేవారు https:/// voters. eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో ఈ-ఎపిక్ కార్డు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మొబైల్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తింపు కార్డుకు ఫోన్ నంబర్ అనుసం ధానం అయితే ఓటీపీ వస్తుంది. లేకుంటే రాదు. ఫారం -8 ద్వారా ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.