హాస్టల్ ను ఆకస్మిక తనిఖీచేసిన రిజిస్ట్రార్ ఎం.యాదగిరి

నవతెలంగాణ- డిచ్ పల్లి:  తెలంగాణ యూనివర్సిటీ లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్ ను గురువారం   రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్.ఎం. యాదగిరి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్. ఎం. యాదగిరి విద్యార్థులు, హాస్టల్ సిబ్బందితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ్యాండ్ వాష్ రూమ్, విద్యార్థులు భోజనం చేసే హాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి అదేశించారు. హాస్టల్లో వంట వారు  విద్యార్థులకు నచ్చే విధంగా వంటలు వండాలని సూచించారు. అనంతరం హాస్టల్లో విద్యార్థులతో కలసి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి, చీఫ్ వార్డెన్ మహేంద్ర ఐలేని డైరెక్టర్( పి ఆర్ ఓ ) ఏ పున్నయ్య  భోజనం చేశారు. హాస్టల్ కేర్ టేకర్ దిగంబర్ చవాన్ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.