గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని స్థానిక సిఐ ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మసాగర్ మండల ప్రజలకు గణేష్ మండపాలలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండపాల్లో కరెంటు ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలని,నీళ్ల బకెట్, ఇసుక డబ్బాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గణేష్ మండపాలలో భక్తిపాటలకు సంభందించిన పాటలను మాత్రమే వినియోగించాలన్నారు. మండపాలలో రాత్రి వేళలలో తప్పనిసరిగా ఒకరు ఉండే విధంగా చూసుకోవాలని, గణేష్ నిమజ్జనాలను తప్పనిసరిగా ఒకరోజు ముందే పోలీస్ స్టేషన్ లో వాటికి సంబంధించిన వివరాలను తెలపాలన్నారు. మండల ప్రజలందరూ గణేష నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సందర్భంగా తెలిపారు.