తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ రవి, నిరంజన్ గస్తీ తిరుగుతుండగా తాడ్వాయి మండల కేంద్ర శివారులో దేమీ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కనే కొంతమంది వ్యక్తులు కారు పక్కన ఆపి మద్యం తాగుతుండగా గుడిమెట్ గ్రామం గాంధారి మండలానికి చెందిన ఆర్ల శివాజీ రావు, బొంపల్లి గ్రామానికి చెందిన హరీష్ లు అక్కడికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ లను ఇక్కడికి ఎందుకు వచ్చారురా మీ సంగతి చూస్తా అని బెదిరిస్తు కానిస్టేబుల్ రవి చొక్క పట్టుకొని నూకివేసి చెప్పారని పదజాలం తో దూషిస్తూ పోలీస్ విధులకు ఆటంక పర్చినారని కానిస్టేబుల్ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, ఆర్ల శివాజి రావు ను జ్యూడిషియల్ రిమాండ్ కి పంపనైనది. అయితే గతంలో ఆర్ల శివాజీ పైన గాంధారి పోలీస్ స్టేషన్ నందు వేరేవాళ్లని కొట్టిన నాలుగు (4)కేసులు అయినాయి