
– ప్రజాప్రతినిధ్య చట్టం 1951 కింద కేసుల నమోదుకు ఆదేశం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఇప్పటివరకు పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉపక్రమించినట్లు జిల్లా కలెక్టర్ హరి చందనదాసరి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. విధులకు రిపోర్ట్ చేయని వారు తక్షణమే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అందరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగార్జునసాగర్, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సిబ్బంది గైర్ హాజరైనట్లు తెలిపారు.