మండలంలోని కాస్లాబాద్,వడ్లం గ్రామాలలో గల పాఠశాలల్లో శనివారం పిఆర్డియూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతు ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం పోరాటం చేసేది పిఆర్డియూ సంఘమే అని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యదికంగా ఉపాధ్యాయులు సభ్యులుగా కలిగి ఉన్న సంఘం పిఆర్టీయూ అని తెలిపారుగతంలో కూడ తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలో పిఆర్డీయూ శాఖ ముందు ఉన్నదని తెలిపారు.రానున్న రోజులలో కూడ ఉపాధ్యాయుల సమస్యల తరపున పిఆర్ యూ పోరాటం చేస్తుందని. గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియూ మండల ప్రధాన కార్యదర్శి కిషోర్ సింగ్,రాష్ట్ర ఉపాధ్యకులు సుదర్శన్ రెడ్డి,కార్యదర్శి బస్వరాజ్ సభ్యులు పాల్గొన్నారు.