పూర్తి అయిన ఐదు హామీల దరఖాస్తుల నమోదు ప్రక్రియ..

నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు  హామీల కోసం గత గతేడాది జనవరి 28 నుండి ఈ నెల 6 వ తేదీ వరకు స్వీకరించి దరఖాస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియ ఈ 16 వ తేదీ నాటి పూర్తి అయిందని ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.

అశ్వారావుపేట మండల వ్యాప్తంగా ప్రజాపాలన గడువులోపు 19913 దరఖాస్తులు అందాయని,ఇతర దరఖాస్తులు తో సహా మొత్తం 19952 దరఖాస్తులను ఆన్ లైన్ చేసాం అని అన్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా 69422 దరఖాస్తులకు గాను ఇతరాలు తో మొత్తం 70043 దరఖాస్తులు ఆన్ లైన్ చేసారు.
మండలం           దరఖాస్తులు                ఆన్లైన్
అశ్వారావుపేట         19913              19952
దమ్మపేట                  19351              19567
ములకలపల్లి             12867               13018
అన్నపురెడ్డి పల్లి           7102                  7164
చండ్రుగొండ               10189                  10342
మొత్తం                      69422                 70043