రెంజల్ మండలం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యనున్న కందకుర్తి చెక్పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలను చేపట్టారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా ముందు జాగ్రత్తగా, పోలీస్ బలగాలు, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో చెక్పోస్ట్ ను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడం జరిగింది. కందకుర్తి చెక్పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి వదిలివేశారు. సీజన్ పూర్తయ్యే వరకు ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని సిబ్బంది పేర్కొన్నారు.