నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో 12 విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా, 2014 సంవత్సరం నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని, రాష్ట్ర క్యాబినెట్లో సైతం తమ అంశం చర్చించకపోవడం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసి తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, డాక్టర్ యాలాద్రి, నరసయ్య, రమాదేవి, సునీత శ్రీకాంత్ , నిరంజన్ శర్మ, వైశాలి, దిలీప్, సరిత తదితరులు పాల్గొన్నారు.