– ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ లీగ్‌కు హాకీ ఇండియా(హెచ్) జట్టును ప్రకటించింది. 24మందితో కూడిన జట్టుకు సలీమా టేటే సారథ్యం వహించనుండగా.. వైస్ కెప్టెన్‌గా నవ్‌నీత్ కౌర్ ఎంపికైంది. ఫిబ్రవరి 15 నుంచి 25వరకు కళింగ హాకీ స్టేడియంలో ఎఫ్‌ఐహెచ్ హాకీ లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న ఇంగ్లండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తన టైటిల్ వేటను కొనసాగించనుండగా… ఆ తర్వాత నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీలతో తలపడనుంది. ఒక్కో జట్టుతో రెండేసిసార్లు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. స్టాండ్‌బై ఆటగాళ్లుగా బన్వారీ సోలంకి, అక్షతా అబాసో థాకలే, జ్యోతి సింంగ్, సాక్షి రాణా, అన్ను, సోనమ్ ఉన్నారు.
జట్టు…
గోల్‌కీపర్లు : సవిత, బిచ్ఛుదేవి ఖరిబమ్
డిఫెండర్లు : సుశీల, నిక్కి ప్రధాన్, ఉదిత, జ్యోతి ఇషికా, జ్యోతి
మిడ్‌ఫీల్డర్లు : వైష్ణవి, నేహా, మనీషా, సలీమా(కెప్టెన్), సునేలిటా,
లాల్‌రెమిసిమి, బల్‌జీత్, షర్మిల
ఫార్వర్డ్స్ : నవ్‌నీత్ కౌర్(వైస్ కెప్టెన్), ముతాజ్, ప్రీతి, రుతుజ, బ్యూటీ,
సంగీత, దీపిక, వందన.