– రెక్లా రేసు అనేది ఒక సాంప్రదాయ క్రీడ.
– వందల ఏండ్ల నుంచి ఆనవాయితీగా క్రీడ
చెన్నై: రెక్లా రేసు అనేది ఒక సాంప్రదాయ క్రీడ. తమిళనాడులో వందల ఏండ్ల క్రితం నుంచి ఈ క్రీడలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతి ఏడాది పొంగల్ సందర్భంగా మూడు రోజులపాటు ఈ రేసులు నిర్వహిస్తారు. బోగీ, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఈ రేసులు జరుగుతాయి.తాజాగా ఈ పొంగల్ సందర్భంగా కూడా తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా రెక్లా రేసులు నిర్వహిస్తున్నారు. ఈ రేసులో ఎద్దుల బండ్లను కాకుండా చిన్న పరిమాణంలో తేలికగా ఉండే చక్రాల బండ్లను వినియోగిస్తారు. ఈ బండ్లనే రెక్లాలు అంటారు. ఒక ఎద్దు బండ్లతోగానీ, రెండు ఎద్దుల బండ్లతోగానీ ఎలాగైనా ఈ రేసును నిర్వహించుకోవచ్చు.ఈ రేసులో గెలిచిన వారికి జల్లికట్టు క్రీడలో మాదిరిగానే బహుమతులను ప్రదానం చేస్తారు. పొంగల్‌ను పురస్కరించుకుని దిండిగుల్ జిల్లాలోని వట్టలగుండు పట్టణంలో రెక్లా రేసుకు సంబంధించిన దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి..