నవతెలంగాణ-జహీరాబాద్
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టేంత వరకు ఉద్యమం ఆగదని ప్రముఖ న్యాయవాది సందీప్ కుమార్ అన్నారు. సామాజిక ఉద్యమకారుడు మందకష్ణ మాదిగ ఆదేశానుసారం జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈ దీక్షలు 22వరకు కొనసాగుతాయన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి కట్టుబడి ఉన్నామంటున్న బీజేపీ.. కాలయాపన చేయకుండా సత్వరమే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అబ్రహం మాదిగ మాట్లాడుతూ.. వర్గీకరణ చేసేంతవరకు ఉద్యమ ఆగదన్నారు. కాగా ఈ దీక్షా శిబిరానికి జహీరాబాద్ బార్ అసోషియేషన్ కార్యదర్శి, కూనదొడ్డి నవీన్ కూమార్, జహీరాబాద్ నియోజకవర్గ ఎంజెఎఫ్ అధ్యక్షులు రాయికోటి నర్సిములు, జహీరాబాద్ నియోజకవర్గ ఎంజెఎఫ్ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ యువ నాయకులు బి.సుధీర్, అఖిల్, వంశీ,విష్ణు వర్దన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు జె.జయరాజ్ తదితరులు సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ సీనియర్ నాయకులు ఉల్లాస్ మాదిగ, ఆగస్టీన్, పి.సుకుమార్, మనోజ్, రజీని, సి.సుకుమార్, చిన్న, రవికుమార్, సంపత్ కుమార్, బబ్లూ, వినరు ,మహేష్, బన్ని తదితరులు పాల్గొన్నారు.