మూడవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు..

Relay hunger strike enters third dayనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ప్రభుత్వం  ఇచ్చిన మాట నిలబెట్టుకుని సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్  చేసి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని గత మూడు రోజుల నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్  ముందు రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా  ఎస్ ఎస్ ఏ కాంట్రాక్టు ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు మంగ  పాండరి  మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వము  అధికారంలోకి వస్తే  కాంట్రాక్టు ఉద్యోగులను  రెగ్యులర్ చేస్తానని చెప్పి సంవత్సరం దాటిన సడి చప్పుడు చేయకపోవడం శోచనీయమని అన్నారు, ఇంకా మాట్లాడుతా ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈనెల పది నుంచి  సమ్మె చేసి   సమగ్ర శిక్ష కార్యక్రమా లను స్తంభింప చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ వివిధ డిపార్ట్మెంట్ల అధ్యక్ష ,కార్యదర్శులు. సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.