రైల్వే భూ బాధితుల రిలే నిరాహార దీక్ష..

నవతెలంగాణ – వేములవాడ
కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్లో విలువైన భూమిని కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విశ్రమించబోయేది లేదనీ డా. కొండ దేవయ్య అన్నారు.  సోమవారం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన సత్రం వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. భూనిర్వాసితులకు మద్దతు తెలుపుతూ డాక్టర్ కొండ దేవయ్య రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కొండ దేవయ్య మాట్లాడుతూ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరాహార దీక్షను విశ్రమించమని అన్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రాన్ని అందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భూనిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వేములవాడలో  ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ ని కలిసి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరామని అన్నారు. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం బండి సంజయ్ కి  అందజేశారు. కార్యక్రమంలో జడల శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.