నవతెలంగాణ-కందుకూరు
పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే చెల్లించాలని డి మాండ్ చేస్తూ సోమవారం కందుకూరు ఎంపీడీవో కార్యా లయం ఎదుట సీఐటీయూ సంఘం ఆధ్వర్యంలో రిలే ని రాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ సంఘం మండల కన్వీనర్ బుట్టి బాలరాజు మాట్లాడు తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడు స్తున్నా మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు చెల్లించ డం లేదని విమర్శించారు. మెస్‌ఛార్జీలు కోడిగుడ్డు, బి ల్లులు 6 నెలలుగా ఇవ్వకపోవడం కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. అధికారం లోనికి రాకముందు సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు దశలవారీగా హామీలు నెరవేరుస్తామన్నారని ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులకు ఉద్యో గ భద్రత కరువైందని స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పజెప్పాలని చూస్తున్నారని విమర్శిం చారు. మధ్యాహ్నం భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌ కర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండలాధ్యక్షులు కళ్యాణ్ కార్ శ్రీనివాస్ కార్యదర్శి ప్రభావతి, నాయకులు కిషన్ జీ, లలి త కార్మికులు పాల్గొన్నారు.