అరవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు…

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో టెంటు కింద రిలే దీక్షలు ఆరవ రోజు కు చేరుకుంది. రెగ్యులరైజేషన్ కోసం తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లు దీక్షను కొనసాగిస్తున్నా న్యాయమైన డిమాండ్ లను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు వి.దత్తాహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీ లలోపనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్ కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి  మా రెగ్యులరైజ్ కోసం ఒక ప్రకటన చేయాలని విన్నవించారు. శనివారం జరిగినటు రాష్ట్రం లోని వివిధ యూనివర్సిటీ లకుచెందిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యాశాఖ మంత్రి కలిశారు.ఇప్పటికైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రిలే దీక్షలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్ పురుషోత్తం సార్ సురేష్, నాగేశ్వరరావు కిరణ్ రాథోడ్  నాగేంద్రబాబు  జి.శ్రీనివాస్, ఆనంద్ బాబు, డాక్టర్ వి దత్తా హరి జలంధర్, డాక్టర్ మోహన్  తదితరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.