సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మజాకా’. ఇది సందీప్ కిషన్ నటిస్తున్న 30వ చిత్రం. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. శివరాత్రి కానుకగా ఈనెల 26న థియేటర్లలో డ్‌గా సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్‌లో సందీప్ కిషన్, రీతు వర్మ చేస్తున్న కలర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ కట్టుకుంటోంది. మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో దర్శకుడు త్రినాథ రావు నక్కిన మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. ఆయనతో జయవంతమైన ప్రాజెక్టులలో కలిసి పని చేసిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈచిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ కాంబోలో ఇదో మెమరబుల్ టర్‌టైనర్ అవుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ‘ఇందులో తండ్రీకొడుకులుగా సందీప్‌కిషన్, రావురమేష్‌ల పాత్రలు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. అసలు వీళ్ళిద్దరికి వచ్చిన సమస్య ఏమిటి?, దాన్ని వీళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. రీతువర్మ, అన్షు పాత్రలు సైతం ఆసక్తికరంగా ఉంటాయి. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని హంగులు ఉన్న ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దర్శకత్వం: త్రినాధరావు నక్కిన, నిర్మాతలు: రాజేష్ దండా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సహ నిర్మాత: బాలాజీ గుత్తా, లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి, సంగీతం: లియోన్ జేమ్స్, డిఓపీ : నిజార్ షఫీ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, స్టంట్స్: పధ్వీ.