ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్‌

Released as a Valentine's Day giftఅమ్మ రాజశేఖర్‌ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాజ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘తల’. అంకిత నాన్సర్‌ హీరోయిన్‌. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో అమ్మ రాజ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల అవుతుంది. వాలంటైన్స్‌ డేకి వస్తున్న ఈ చిత్రం అందర్నీ అలస్తుంది. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళుతుంది. యాక్షన్‌, సాంగ్స్‌ అన్నీ కంటెంట్‌లో భాగంగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి’ అని అన్నారు. హీరోయిన్‌ అంకిత మాట్లాడుతూ,’నేను బెంగాలీ. ఇదినా ఫస్ట్‌ సినిమా. ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మ రాజశేఖర్‌కి థ్యాంక్స్‌. ప్రతి ఒక్కరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్‌ చేయండి’ అని తెలిపారు. ‘ఇండిస్టీలో అంతా అమ్మ రాజశేఖర్‌ ఫినిష్‌ అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాను. నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. శ్రీనివాస్‌ గౌడ్‌ నా దేవుడు. నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. ఈ మూవీ కొని తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీస్‌ చేస్తున్నారంటే గట్స్‌ కావాలి’ అని దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: శ్యామ్‌ కె నాయుడు, సాంగ్‌: థమన్‌ ఎస్‌ఎస్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: ధర్మ తేజ, అస్లాం కేఈ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాధ రాజశేఖర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామకష్ణ, లిరిసిస్ట్స్‌: ధర్మతేజ, ఎడిటర్‌ : శివ సామి.