బంధన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ విడుదల

ముంబయి : బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌ బంధన్‌ ఫైనాన్సీయిల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది పెట్టుబడిదారులకు ఆర్థిక సేవల రంగంలో విస్తృతావకాశాలు కల్పిస్తుందని ఆ సంస్థ తెలిపింది. కొత్త ఫండ్‌ ఆఫర్‌ జులై 10న తెరుబడుతుందని.. జులై 24న ముగుస్తుందని తెలిపింది. పెట్టుబడి లైసెన్స్‌ పొందిన మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఆన్‌లైన్‌ ఆర్థిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నేరుగా ఈఫండ్‌ను ఎంచుకోవచ్చని పేర్కొంది.