బసవేశ్వర్ విగ్రహవిష్కరణ ఆహవ్వాన చేతి కరపత్రం విడుదల

నవతెలంగాణ – జుక్కల్
కోడ్చిర గ్రామములోబసవేశ్వర్ విగ్రహవిష్కరణ ఆహవ్వాన కరపత్రాలను మండలంలోని పడంపల్లి గ్రామములో వీరశైవ లింగాయత్ సమాజ పెద్దలకు ఆహవ్వానం కోరకు విడుదల  శుక్రవారం చేసారు. ఈ సంధర్భంగా గ్రామపెద్గ సత్యప్పా, మెుండకార్ మల్లికార్జున్ మాట్లాడుతు మద్నూర్ మండలంలోని కొడ్చిర గ్రామములో గ్రామస్తుల ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేసారు. సెప్టంబర్ 17వ తేదిన అవిష్కణ చేయడం జర్గుతుందని, ముఖ్య అథితిగా స్థానిక ఎమ్మేలే హన్మంత్ షిండే, ఎంపి బిబి పాటీల్, మాజీ ఎమ్మేలే గంగారాం, ఆరుణాతారా, జగద్గురువులు తదితరులు పాల్గోననున్నారని తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణలో పడంపల్లి యూత్ సబ్యులు వీరభద్ర,  ప్రభూ, శ్రీకాంత్, వికాస్ , వీరశైవులు సదాకర్, శంకర్ పటేల్, తదితరులు పాల్గోన్నారు.