హైదరాబాద్ : జెఎస్‌డబ్ల్యు ఎంజి మోటార్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విండ్సర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. పిపిఎస్ మోటార్స్ షోరూంలో దీన్ని జెఎస్‌డబ్ల్యు ఎంజి మోటార్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సతీందర్ సింగ్ బజ్వా విడుదల చేశారు. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.13,49,800గా నిర్ణయించారు. ఇది భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సియువి సెడాన్ అని సతీందర్ తెలిపారు. వినియోగదారులకు విలాసవంతమైన బిజినెస్‌క్లాస్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. తమ మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ప్రస్తుతం 40శాతం ఉండగా, ఎంజి విండ్సర్ ఆవిష్కరణతో ఈ మార్క్ 50 శాతానికి అధిగమించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.