నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిప్యూటీ తహసిల్దార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఆడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) మెంబర్ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ల వారీగా నియామకం, బదిలీలు, ప్రమోషన్లకు కొత్త సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని పేర్కొంది. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నేరుగా నియామకం పొందిన వారికీ, వివిధ కేటగిరిల్లో పని చేసి నాయబ్ తహసిల్దార్లుగా ప్రమోషన్ పొందిన వారికి ప్రత్యేక నిబంధనలు పొందు పర్చారు.