దోమల నివారణకు ఆయిల్ బాల్స్ విడుదల

Release of oil balls for mosquito controlనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఆయా కాలనీల్లో వర్షపు నీరు నిలిచిన ప్రదేశాల్లో దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వదిలినట్లు పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్ తెలిపారు.గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో ఇందుకోసం అవసరమైన  ఆయిల్ బాల్స్ తయారు చేయించినట్లు తెలిపారు. మంగళవారం అట్టి ఆయిల్ బాల్స్ ను మురుగునీటి కుంటల్లో, వర్షపు నీరు చేరే ప్రదేశాల్లో పంచాయతీ సిబ్బందితో వేయించినట్లు తెలిపారు.ఆయిల్ బాల్స్ ను వదలడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమల లార్వ చనిపోతుందన్నారు. ఆయా ప్రదేశాల్లో  పదుల సంఖ్యలో ఆయిల్ బాల్స్ ను వదిలినట్లు ఆయన వివరించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో  దోమల నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పాగింగ్  చేయించినట్లు వివరించారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, చెత్తాచెదారం మురికి కాల్వలో ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు  అన్నారు.