హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ప్రొవిజినల్‌ జాబితా విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్‌ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పొందుపరిచామని తెలిపారు. ఇతర వివరాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.