ట్రాన్స్‌కోకు రూ.4,791.65 కోట్లు విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీజీట్రాన్స్‌కోకు రూ.4,791.65 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు నిధుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ, అనుబంధరంగాల సబ్సిడీ పథకాల్లో భాగంగా ఈ నిధుల్ని విడుదల చేసినట్టు తెలిపారు. 2024 నవంబర్‌ నుంచి 2025 మార్చి నెల (ఐదు నెలలు) వరకు నెలకు రూ.958.33 కోట్లు చొప్పున ఐదునెలల మొత్తానికి బడ్జెట్‌ కేటాయింపు ఇచ్చారు. ప్రతినెలా యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు సమర్పించి ఈ నిధుల్ని వాడుకోవచ్చని పేర్కొన్నారు.