సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీకౌంటింగ్ కు షెడ్యూల్ విడుదల..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బి.ఎడ్ ఒకటవ మరియు బి.పి.ఎడ్. ఒకటవ మరియు మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుషన్/ రీకౌంటింగ్ కొరకు  షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ  పరిధిలోని బి.ఎడ్ రెగ్యులర్ ఒకటవ సెమిస్టర్  ఏప్రిల్ లో పరీక్షకు హాజరైన విద్యార్థులు రీవాల్యుయేషన్/ రీకౌంటింగ్  కోరుకున్నట్లయితే ఈనెల 11 లోపు ప్రతి పేపర్ కు రివాల్యుయేషన్   ఫీజు రూపాయలు.500/రీకౌంటింగ్ కొరకు  రూపాయలు. 300/ చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ పేర్కొన్నారు. రెగ్యులర్ బి.పి.ఎడ్ ఒకటవ,మూడవ సెమిస్టర్ మార్చి లో  జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్థులు రీవాల్యుయేషన్/ రీకౌంటింగ్ కోరుకున్నట్లయితే ఈనెల 28 లోపు ప్రతి పేపర్ కు రివాల్యుయేషన్   ఫీజు రూపాయలు.500/ రీ కౌంటింగ్ కు  రూపాయలు. 300/ చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.