ఓటర్ జాబితా విడుదల

– జిల్లాలో 80559 మంది  ఓటర్లు 
– కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను గురువారం ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1నవంబర్  2023 అర్హత తేదీ ఆధారంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు  జాబితా పై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం  అనంతరం తుది ఓటరు జాబితాను గురువారం 12 జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, తహసిల్దార్ కార్యాలయాలతో పాటు, సంబంధిత పోలింగ్ కేంద్రాలలో సైతం  ప్రచురించినట్లు ఆమె వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలను  విడుదల చేసారు. కాగా నల్లగొండ జిల్లాలో నాలుగు డివిజన్లకు సంబంధించి 51370 పురుష ఓటర్లు, 29189 మహిళా ఓటర్లు మొత్తం 8059 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.