మండల కేంద్రంలోని పెద్ద చెరువు తుము ద్వారా చెరువు కట్ట కింద ఉన్న పంటలకు నీటిని విడుదల చేశారు. చెరువులో వానకాలం పంటలకు సరిపడా నీరు ఉండడంతో విడుదల చేశామని గ్రామ సదర్ సల్ల నర్సయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి నర్సయ్య, పి.సురేష్, రైతులు పాల్గొన్నారు.