తుంగ చెరువు లోకి నీళ్లు విడుదల చేయండి

Release water into Tunga pond– నీటిపారుదల ఈఈ సాయిబాబా ను ఆదేశించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
నవతెలంగాణ – తొగుట
తుంగ చెరువు లోకి నీళ్లు విడుదల చేయలని నీటి పారుదల ఈఈ సాయిబాబా ను దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. పత్రిక సమాచా రం ప్రకారం కూడవెల్లి వాగులో నీరు ప్రవహిస్తున్న సందర్భంగా చందాపూర్ మొండి మత్తడి నుండి పీడర్ చానల్ ద్వారా జప్తిలింగారెడ్డి పల్లి సమీపం లో ఉన్న తుంగ చెరువు లోకి నీటిని విడుదల చేయాలన్నారు. రెండు రోజులుగా వాగు ప్రవహిస్తు న్నా తుంగ చెరువులోకి నీటిని విడుదల చేయడం లేదని రైతులు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసు కెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభా కర్ రెడ్డి నీటిపారుదల ఈఈ సాయి బాబా తో ఫోన్ లో మాట్లాడారు. చందాపూర్ మొండి మత్తడి నుండి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే నీటిని విడుదల చేస్తామని ఈఈ తెలిపారు. కాలువ పిచ్చి మొక్కలతో నిండి  పోయిందని, తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.