నయా టైటిల్‌తో రిలీజ్‌

Released with a new titleహీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కష్ణ అండ్‌ హిజ్‌ లీల’. కరోనా కారణంగా ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణ సాధించింది. రవికాంత్‌ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజరు రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు.
ఈ పాపులర్‌ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయడానికి రానా దగ్గుబాటి సిద్ధంగా ఉన్నారు. డిజిటల్‌లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఈనెల 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’గా మార్చారు. ఈ కొత్త టైటిల్‌ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్‌కి పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్‌ పెరెపు ఓ హిలేరియస్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. ఓటీటీలోనే కాకుండా థియేటర్లలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రీచరణ్‌ పాకాల కెమెరా : షానియల్‌ డియో, సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు.