క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌

Released as a Christmas giftక్రిస్మస్‌ సీజన్‌ని క్యాష్‌ చేసుకోవడానికి మరో సినిమా రంగంలోకి దిగింది. ఇప్పటికే క్రిస్మస్‌ పండగ సందర్భంగా నితిన్‌ ‘రాబిన్‌ హుడ్‌’, వెన్నెలకిషోర్‌ ‘శ్రీకాకుళం షెర్లాకహేోమ్‌’, కొత్త నటీనటులు నటించిన ‘పతంగ్‌’తోపాటు కీర్తిసురేష్‌ బాలీవుడ్‌లోకి అడుగిడుతూ నటించిన ‘బేజీ జాన్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హీరో కిచ్చా సుదీప్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మ్యాక్స్‌’ చిత్రం కూడా క్రిస్మస్‌ పండగ కానుకగా ఈనెల 25న విడుదల కానుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్‌, కిచ్చా క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కలైపులి ఎస్‌ థాను నిర్మించారు. విజరు కార్తికేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కన్నడ, హిందీతోపాటు తెలుగులోనూ ఈనెల 25న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో అర్జున్‌ మహాక్షరు అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్‌ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడుతున్నాయి. అలాగే ఈనెల 25న పలు చిత్రాలు విడుదలవు తున్నప్పటికీ తెలుగులో సుదీప్‌కి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రానికి కూడా భారీ ఓపెనింగ్స్‌ వస్తాయని మేకర్స్‌ నమ్మకంతో ఉన్నారు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – శేఖర్‌ చంద్ర, ఎడిటింగ్‌ – ఎస్‌ఆర్‌ గణేష్‌ బాబు, మ్యూజిక్‌ – అజనీష్‌ లోకనాథ్‌.