దర్శక, నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను సోమవారం హీరో మహేష్‌బాబు రిలీజ్ చేయగా, తమిళ టీజర్‌ను ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీపావళికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.