దీపావళి కానుకగా రిలీజ్‌

దీపావళి కానుకగా రిలీజ్‌శివకార్తికేయన్‌ నటిస్తున్న బాహుభాషా బయోగ్రాఫికల్‌ యాక్షన్‌ మూవీ ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో నాని ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ట్రైలర్‌ ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ అమరవీరుడు మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పరిచయం చేస్తుంది. మేజర్‌ ముకుంద్‌, అతని కుమార్తె హార్ట్‌ టచ్చింగ్‌ ఫుటేజ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో శివకార్తికేయన్‌, అతని భార్యగా సాయి పల్లవి, ఆన్‌-స్క్రీన్‌ డాటర్‌ క్యారెక్టర్స్‌లోకి ట్రైలర్‌ నేచురల్‌గా ట్రాన్స్‌ఫర్మేన్షన్‌ అవ్వడం కట్టిపడేసింది. తన దేశానికి సేవ చేయడంలో మేజర్‌ ముకుంద్‌ నిబద్ధత గూస్‌ బంప్స్‌ తెప్పించింది. ట్రైలర్‌లో ధైర్యం, త్యాగం థీమ్స్‌తో పాటు మేజర్‌ ముకుంద్‌ సైనిక జీవితం, ఫ్యామిలీ బాండింగ్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు అని చిత్ర బృందం తెలిపింది. హీరో నితిన్‌ ఫాదర్‌ సుధాకర్‌ రెడ్డి, సిస్టర్‌ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.