దసరా కానుకగా విడుదల

Released as a Dussehra giftశివరాజ్‌ కుమార్‌ హీరోగా పాన్‌ ఇండియా లెవెల్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఘోస్‌’్ట. శ్రీని దర్శకత్వంలో రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ తన సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌ మ్యూజిక్‌’ లిరిక్‌ వీడియోను విడుదల చేశారు. అర్జున్‌ జన్య కంపోజ్‌ చేసిన ఈ హై ఓల్టేజ్‌ సాంగ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఉన్న లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటను రిలీజ్‌ చేశారు. శివరాజ్‌ కుమార్‌ పవర్‌ ఫుల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో పాటు, మేకింగ్‌ గ్లింప్సెస్‌తో ఉన్న లిరికల్‌ వీడియో సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా ఉంది’ అని చిత్ర బృందం తెలిపింది.