రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, నాలుగు సాంగ్స్, వాటి మేకింగ్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. వస్తోన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌తో ఈ సినిమా ఉత్సాహంగా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ఖాయం అని చిత్ర యూనిట్ తెలిపింది.