7 భాషల్లో రిలీజ్‌

Released in 7 languagesప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న 50వ చిత్రం ‘డిటెక్టివ్‌ తీక్షణ’. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ వేడుక బెంగళూరులోని ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పలు భాషల్లో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో ఉపేంద్ర రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘డిటెక్టివ్‌ పాత్రలను సరిగ్గా మలిచినప్పుడు అవి తెరమీద అద్భుతంగా వస్తాయి. ట్రైలర్‌లో మ్యూజిక్‌ రోమాంఛితంగా ఉంది. ప్రియాంక 50 చిత్రాలు పూర్తి చేశారు. నేను ఇంకా 46వ చిత్రం దగ్గరే ఉన్నాను. మా వందో చిత్రానికి మేమిద్దరం కలిసి పని చేస్తామని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ”ప్రియాంక నా టాలెంట్‌ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ రఘు చెప్పారు. నాయిక ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా లేకపోయినప్పటికీ మెంటల్‌గా మాత్రం ఎంతో షార్ప్‌. దర్శకుడు త్రివిక్రమ్‌ రఘుకు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది’ అని తెలిపారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒరియా ఇలా ఏడు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.