100కి పైగా థియేటర్లలో రిలీజ్‌

100కి పైగా థియేటర్లలో రిలీజ్‌క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘చే’ – లాంగ్‌ లైవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందిన చేగువేరా బయోపిక్‌ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై బీఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించిన ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్‌, కార్తీక్‌ నూనె, వినోద్‌, పసల ఉమా మహే శ్వర్‌ కీలకపాత్రలు పోషించారు. రవిశంకర్‌ సంగీతం అందించారు. సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘చే’ మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన చేగువేరా తనయ డాక్టర్‌ అలైదా గువేరా ట్రైలర్‌, టీజర్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు సినిమా విడుదల సందర్భంగా హీరో, దర్శకుడు బిఆర్‌ సభావత్‌ నాయక్‌ మాట్లాడుతూ, ‘పవన్‌ కళ్యాణ్‌ ఆరాధించే విప్లవ వీరుడు, యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడం చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాం. ఆయన చేసిన పోరాటాలను, త్యాగాలను ఈ చిత్రంలో చూపించాం. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా రూపొందించాం. ప్రమోషన్‌లో భాగంగా కాలేజ్‌లకు వెళ్లినప్పుడు యువతను నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. వీరాంజనేయ పిక్చర్స్‌ సంస్థ ద్వారా 100కు పైగా థియేటర్‌లలో ఈనెల 15న రిలీజ్‌ చేస్తున్నాం’ అని అన్నారు.