అత్యధిక ధియేటర్లలో రిలీజ్‌

అత్యధిక ధియేటర్లలో రిలీజ్‌లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్‌ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్‌’. ఈ చిత్ర తెలుగు హక్కులు ఆర్‌ కె ఫిలిమ్స్‌ అధినేత డా. ప్రతాని రామకష్ణ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. హీరో సుమన్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత డా. ప్రతాని రామకష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, ‘లక్మీ రారు త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్‌ మాస్టర్‌ థ్రిల్లర్‌ మంజు కంపోజ్‌ చేసిన 8 ఫైట్స్‌ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. సెన్సార్‌ పూర్తయ్యింది. నవంబర్‌ రెండో వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు. సుమన్‌, తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్‌, డాన్సర్‌, నటి ఆక్సఖాన్‌, నటుడు జెవిఆర్‌ తదితరులు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.