లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో తమిళంలో విడుదలై, ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. చిత్రం ఈనెల 29న తెలుగులో విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రాన్ని ఆర్ కె ఫిలిమ్స్ పతాకం ద్వారా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు నిర్మాత ఆర్.కె. గౌడ్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ, ‘సినిమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. నా ‘కర్తవ్యం’ మూవీ చూసి చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్‌మెంట్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. అలాగే ‘భారతీయుడు’ మూవీ చూసి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారు. ‘బార్సు’ సినిమా చూసి ఇంట్లోంచి బయటకు వచ్చి సినిమాల కోసం ప్రయత్నించానని కేజీఎఫ్ హీరో యష్ నాతో చెప్పారు. అలా సినిమా మాధ్యమం ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. లక్ష్మీరారు యాక్షన్ బాగా చేయగలదు. ఈ సినిమాతో రామకష్ణ గౌడ్‌కి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎన్నో ఘన విజయాలు సాధించాయి. అలాంటి ప్రయత్నమే మా సంస్థ ద్వారా ఈ సినిమాతో చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత ‘మహిళా కబడ్డీ జట్టు’ అనే మూవీ చేస్తున్నాం. ఢ విన్నర్ అక్సా ఖాన్ ఆ సినిమాలో నటిస్తారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తాం’ అని నిర్మాత డా. ప్రతాని రామకష్ణ గౌడ్ చెప్పారు.