శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పెక్టకిల్ ‘ఘోస్ట్’ కన్నడ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల19న దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా తొలి రోజే టెర్రిఫిక్ రివ్యూస్‌తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీని దర్శకత్వంలో ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో నవంబర్ 4న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలో విడుదలకు సిద్ధం అవుతోంది.
‘దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన ఈచిత్ర ట్రైలర్‌కి ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. శివరాజ్ కుమార్ పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా నటించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా కచ్చితంగా రీచ్ అవుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది.