సుధీర్ బాబు త్రిపాత్రాభినయంతో అలరించబోతున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో స్థూలకాయుడు, ఓల్డ్ డాన్, డిజె ..ఇలా మూడు భిన్నమైన పాత్రలను సుధీర్ బాబు చేస్తున్నారు. మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సష్టి సమర్పిస్తున్నారు.