28న రిలయన్స్‌ ఎజిఎం

Reliance AGM on 28న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం) ఈ నెల 28న జరుగనుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ చెల్లింపులకు రికార్డు తేదీని ఆగస్టు 21గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సారి వార్షిక సమావేశంలో ప్రధానంగా రిలయన్స్‌ జియో ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌పై కీలక ప్రకటన చేస్తారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.