అసాంజేకు ఉపశమనం

– అప్పగింతపై అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం
లండన్‌ : వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు ఇంగ్లండ్‌ హైకోర్టు సోమవారం ఉపశమనం కలిగించింది. తనను అమెరికాకు అప్పగించడం నిర్ణయంపై అప్పీల్‌ చేసుకునేందుకు అసాంజేకు హైకోర్టు అవకాశం ఇస్తూ తీర్పు ఇచ్చింది. సున్నితమైన మిలటరీ, దౌత్య వివరాలు ప్రచురించారని, గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించారని వంటి ఆరోపణలతో అమెరికా అసాంజేపై అభియోగాలు మోపింది. అసాంజేను తమకు అప్పగించాలని ఇంగ్లండ్‌ను కోరింది. దీంతో మరణ శిక్ష వర్తించదు, వాక్‌ స్వాతంత్య్ర హక్కులకు భంగం కలిగించమనే అమెరికా ఇచ్చిన రెండు హామీలతో అసాంజేను అప్పగించడానికి ఇంగ్లండ్‌ ముందుకు వచ్చింది. అయితే అమెరికా హామీలు ‘అమలు కానీ హామీలు’ అంటూ కోర్టు అసాంజే తరుపు న్యాయవాదులు ఆశ్రయించారు. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కోర్టు వెలుపల గుమిగూడిన జనం హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా అసాంజే భార్య స్టెల్లా మాట్లాడుతూ అమెరికా వాదనలు ఖండించారు. అలాగే ఈ కేసును జర్నలిస్టులపై దాడిగా అభివర్ణించారు. 2019లో అసాంజే అత్యంత భారీ భద్రత కూడిన బెల్మార్ష్‌ జైలులో ఉంటున్నాడు.అసాంజేకు ఉపశమనంఅప్పగింతపై అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం