– గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ
మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లకు మరమ్మ తు లు చేపట్టేందుకుగానూ సర్కారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో శిథిలావస్థలో ఉన్న, ఇండ్లు కూలిన బాధితు ల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయ డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి తెలిపారు.ఈ నేపథ్యంలో తార్నాకలోని చంద్రబాబు నాయుడు నగర్ బస్తీ వాసులు, స్థానికులు గ్రేటర్ హైదరా బాద్ నగర డిప్యూటీ మేయర్, బీఆర్‌ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని కతజ్ఞతలు తెలి పారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి, వారికి ఆర్థికంగా అండగా నిలిచినందుకు కతజ్ఞతలు తెలిపారు. తదనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నివాసాలు లేక, వర్షాల కారణంగా ఇండ్లు కూలి ఇబ్బందులు పడుతున్న వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు అందేలా తమవంత సహకారం అందిస్తామని తెలిపారు.