మత రాజకీయాలు ప్రమాదకరం

Religious politics is dangerous– రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ – మెదక్‌
దేశంలో బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని, ఈ విధానం దేశానికే ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం సీపీఐ(ఎం) జిల్లా విస్కృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని కేవల్‌ కిషన్‌ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ మత పరమైన విధానాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్వహించడమనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరు గ్యారంటీలను పటిష్టంగా అమలుచేయాలన్నారు. గత 3 రోజులుగా గ్రామాలలో తీసుకుంటున్న దరఖాస్తులలో చాలా గందరగోళం ఉన్నదని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రజలకు సంబందించిన దరఖాస్తులు తీసుకున్న ఎంతలోపు వారీ దరఖాస్తు పరిశీలించి అమలు చేస్తారో స్పష్టత లేదన్నారు. ప్రతి దానికి ఆధార్‌ కార్డు కచ్చితంగా కావాలని ప్రభుత్వం చెబుతున్న అందులో ఎదైనా తప్పిదాలు జరిగిఉంటే కరెక్షన్‌ చేసుకోవాలని చూస్తే నెలల తరబడి తిరగాల్సి వస్తోందన్నారు. ఆధార్‌ సెంటర్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, జిల్లా కార్యద్శివర్గ సభ్యులు నర్సమ్మ, మహేందర్‌ రెడ్డి, మల్లేశం, బస్వరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి నాగరాజు, సంతోష్‌, సర్దార్‌, బగయ్య, నాయకులు బాలమని, లచ్చాగౌడ్‌, బాబు, అజరు, జగన్‌ పాల్గొన్నారు.