– ప్రత్యేకవిడతలో 19,043 మందికి సీట్ల కేటాయింపు
– సెల్ఫ్‌రిపోర్టింగ్ గడువు నేడే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో బుధవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. 114 పాలిటెక్నిక్ కాలేజీల్లో 29,610 సీట్లున్నాయని తెలిపారు. 19,043 (64.3 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 10,567 (35.7 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. 57 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,692 సీట్లుంటే, 10,711 (78.2 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 2,981 (21.8 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. 57 ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 15,918 సీట్లుండగా, 8,332 (52.3 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 7,586 (47.7 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. ఫీజు చెల్లింపునకు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసేందుకు గడువు గురువారం వరకే ఉందని పేర్కొన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ (కాలేజీలో కేంద్రీకృత అంతర్గత స్లైడింగ్)కు ఈనెల ఐదు, ఆరు తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదు చేయాలని సూచించారు. దీనికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని వివరించారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రజూశీశ్రీyషవ్.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.