అసంపూర్తిగా మిగిలిన బీటీ రోడ్డు

– ఈ ప్రభుత్వంలోనైన పూర్తి అయ్యేనా? 
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండలంలోని అంజని గ్రామం నుండి పోచారం తాండ వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బీటీ రోడ్డు నిర్మాణం చేసి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పూర్తియిన అంజని,శివాపూర్ గ్రామ మధ్యలో సుమారు 800 మీటర్ల రోడ్డును బీటీ వేయకుండా అలాగే వదిలేయడం జరిగింది.గతంలో మిగిలిన రోడ్డును పూర్తి చేయాలని అప్పటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను ఇక్కడి ప్రజలు పలుమార్లు విన్నవించగా 800 మీటర్ల రోడ్డు అటవీశాఖలో ఉన్నందున బీటీ వేయకుండా మిగిలిపోయిందని వెంటనే అటవీశాఖ అధికారుల నుండి  అనుమతి తీసుకొని పనులు పూర్తి చేసే విదంగా కృషి చేస్తానని  హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు అటవీశాఖ  అధికారుల నుండి అనుమతులు  రాకపోవడంతో ప్రయాణికులు కంకరా తేలిన రోడ్డు మీదనే ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా గడచిన అటవీశాఖ అధికారుల నుండి అనుమతి  తీసుకొని రోడ్డు వెయ్యేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా నూతన కాంగ్రేస్ ప్రభుత్వంలో జుక్కల శాసన సభ్యులు తోట లక్ష్మికాంత్ రావు  మండలంలో గత నెలలో స్వర సభ్య సమావేశానికి   హాజరుకావడంతో రోడ్డు సమస్యను పరిష్కరించాలని ఆయన దృష్టికి పలువురు నాయకులు తీసుకెళ్లగా సంబంధించిన శాఖ అధికారులకు  అసంపూర్తిగా మిగిలిన రోడ్డును త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.ఏది ఏమైనా ఇటు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రజల కష్టాలను దూరం చేయాలని కోరుతున్నారు.