జులై 6న రెమీడియం లైఫ్‌కేర్‌ బోనస్‌ ఇష్యూ..

ముంబయి : ఫార్మాస్యూటికల్‌ కంపెనీ రెమీడియం లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ బోర్డు బోనస్‌ ఇష్యూ షేర్ల రికార్డ్‌ తేదిని జులై 6గా ప్రకటించింది. తమ వాటాదారులకు ప్రతీ మూడు షేర్లకు ఒక్క షేర్‌ను అదనంగా కేటాయించడానికి ఆ కంపెనీ బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం జూన్‌ 23 నుంచి జూన్‌ 25వరకు వాటాదారుల ఆమోదానికి పెట్టినట్లు తెలిపింది.