రోడ్డు కి ఇరువైపులా పొదలు తొలగింపు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో చేపట్టాల్సిన బుష్ కటింగ్ పనులు నిర్వహిస్తున్నారు.మండలంలోని వాగొడ్డుగూడెం నుంచి పండువారిగూడెం వెళ్లే మార్గం, అశ్వారావుపేట శివారు నుంచి వినాయకపురం వెళ్లే ప్రధాన రహదారుల ఇరువైపుల పిచ్చి మొక్కలు, ఏపుగా పెరిగి రోడ్లను కమ్మేశాయి. దాంతో ఈ పిచ్చి మొక్కల్ని తొలగించాలని చాలా కాలం నుంచి వాహనదారులు,రోడ్లు భవనాలు శాఖ అధికారులు మొర పెట్టుకున్న పట్టించుకోలేదు. కాగా ఎట్టకేలకు గడిచిన కొద్ది రోజులుగా ఆయా మార్గాల్లో జే.సీ.బీ లు,బ్లేడ్ ట్రాక్టర్లతో ముమ్మరంగా పొదలు ను, మొక్కల్ని తొలగించి, శుభ్రం చేసే పనులు చేపట్టారు.