సోమనాథ్‌ ఆలయ భూమిలో ఆక్రమణలు తొలగింపు..

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో సోమనాథ్‌ ఆలయం వెనుక ఉన్న భూమిలో ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 21 ఇండ్లతోపాటు 150కుపైగా గుడిసెలను నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్‌ ఆలయానికి చెందిన ట్రస్ట్‌, గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన 3 హెక్టార్ల భూమి (7.4 ఎకరాలు) ఆక్రమణలకు గురైంది. 21 ఇండ్లతోపాటు సుమారు 153 గుడిసెలను అక్రమంగా నిర్మించారు. కాగా, సోమనాథ్‌ ఆలయ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు శనివారం మెగా డ్రైవ్‌ నిర్వహించారు.